NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ పథకాలు. నేరుగా ప్రజల చెంతకు…

1 min read

– వాలంటీర్ వ్యవస్థ భేష్. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి .

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందిస్తున్నామని బిలకల గూడూరు గ్రామంలో శనివారం నాడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు అందిన నవరత్నాల బుక్ లెట్ ను గడపగడపకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందుతున్నాయన్నారు, లబ్ధిదారులకు అన్ని పథకాలు అందాయా లేదా అని లబ్ధిదారులను  ఎమ్మెల్యే  ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ పై నమ్మకం కుదిరించుకుంటూ అభివృద్ధి దృష్టిలో పయనిస్తున్నారన్నారు వచ్చే ఎన్నికలలో 175 స్థానాలు గెలుచుకొని మళ్ళీ వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ఎంపీపీ నాగమద్దమ్మ జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి. సొసైటీ చైర్మన్ శేఖర్ రెడ్డి వైసిపిమండల అధ్యక్షుడు శివరాం రెడ్డి. రఘు మాధవరెడ్డి. రాజారెడ్డి. ఆర్ బి కే కరిమద్దెల పుల్లయ్య. మేఘనాథ్ రెడ్డి ఉపసర్పంచ్ బాలచెన్ని  భూపాల్ రెడ్డి. ఎల్లారెడ్డి. ఎంపీటీసీ ఒగ్గు రామస్వామి. మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author