పురమిత్ర’ ద్వారా పౌరులకు సులువుగా ప్రభుత్వ సేవలు
1 min read
ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు సులువుగా ప్రభుత్వ సేవలు అందించేందుకు రూపొందించిన ‘పురమిత్ర’ యాప్‌ను నగరంలో ప్రతి పౌరుడు డౌన్లోడ్ చేసుకోవాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. స్థానిక సమస్యల ఫిర్యాదులు, వివిధ రకాల పన్నులు చెల్లింపులు వంటి అనేక రకాల సేవలను పౌరులు తమ మొబైల్ నుండే సులువుగా పొందవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌ను సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, 9552300009 ఈ నెంబర్ ద్వారా వాట్సాప్‌లో పలు రకాల సేవలు పొందగలరని కమిషనర్ వెల్లడించారు. పన్ను చెల్లింపులు, ఫిర్యాదులు, దరఖాస్తులు, పరిశుభ్రత, ప్రజారోగ్యం, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, పట్టణ పేదరిక నిర్మూలన, ఇంజినీరింగ్, వీధి దీపాలు, రెవెన్యూ (పన్నులు, లీజులు) వంటి సేవల కోసం కార్యాలయాల చుట్టూ పౌరులు తిరగాల్సిన అవసరం ఇక లేదని, తమ మొబైల్‌లోనే నిర్దిష్ట సమయంలోపు సమస్యకు పరిష్కారం పొందగలరని కమిషనర్ స్పష్టం చేశారు.