ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి..
1 min read– విజయవాడలో రాష్ట్ర సదస్సుకు తరలి రండి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: బుధవారం మిడుతూరు మండల కేంద్రమైన మహిళా మండల సమాఖ్య భవనంలో సమావేశం జరిగినది. అంగన్వాడి వర్కర్స్&హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ కి కనీస వేతనాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్ఛా రని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఉద్యోగ భద్రత,పని భారం తగ్గింపు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26 వేలు గ్రాడ్యుటీ అమలు ఇంప్లిమెంట్ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదని దాని వలన ఇబ్బందులు వస్తున్నాయని సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ఈనెల 27వ తేదీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో అంగన్వాడి సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని రాబోయే నాలుగు నెలల కాలంలో ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళా కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సదస్సు జయప్రదం చేయాలని అంగన్వాడి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అనంతరం నందికొట్కూరు ప్రాజెక్టు సిడిపిఓ కోటేశ్వరమ్మకి వినతిపత్రం అందించారు.ఈకార్యక్రమంలో సెక్టర్ లీడర్ల రాధమ్మ,సరోజ,ఉమాదేవి,భాగ్యమ్మ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.