సిపిఎస్ రద్దు పై ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి : ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) అనంతపురం జిల్లా కార్యవర్గ సమావేశం అనంతపురం నందు ఆపస్ కార్యాలయం నందు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ శ్రావణ్ కుమార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ, రాష్ట్ర సహాధ్యక్షులు యస్ రామ్మోహన్ రెడ్డి , ఏ బి అర్.యస్ యం జాతీయ నాయకులు యం రాజశేఖర రావు గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుత సిపిఎస్ రద్దు పై ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి అని, డి ఏ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, పెండింగ్ గా ఉన్న కొత్త డి ఏ లను ఇవ్వాలని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ మాట్లాడుతూ కోర్టు కేసుల వల్ల బదిలీలు జరప లేకున్నమని చెబుతున్న ప్రభుత్వం టీచర్లకు శాశ్వత బదిలీల కోడ్ రూపొందించి ఈ వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలని, 2500 తో పని చేసే ప్రమోటీ ఉపాధ్యాయులకు వెంటనే శాశ్వత ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని, జిల్లాలో సస్పెండ్ అయిన 8 మంది ఉపాధ్యాయులను సస్పెన్స్ కాలాన్ని సెలవు దినాలుగా పరిగణించాలని కోరడం జరిగింది.ABRSM జాతీయ నాయకులు రాజశేఖర్ రావు విద్యార్థుల్లో జాతీయ భావాలు, నైతిక విలువలు పెంపొందించే దిశగా పనిచేయాలని కోరడం జరిగింది.రాష్ట్ర సహాధ్యక్షులు యస్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర ప్రసాద్ ఉపాధ్యక్షులు భాస్కరయ్య అనంతపురం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కళ్యాణి ప్రధాన కార్యదర్శి ఎర్రి స్వామి సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ కోశాధికారి అరవింద్ మరియు రాజశేఖర్ , వేణుగోపాల్, హర్షవర్ధన్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.