PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘వినాయక’ ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు తొలగించాలి: టీడీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి : వినాయక చవితి ఉత్సవాల పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగించి పండగ రోజు వినాయక మండపాలు ఏర్పాటు కు అనుమతి ఇవ్వాలని టిడిపి సీనియర్ నాయకులు రామచంద్రరెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆలూరు టిడిపి ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు మంగళవారం మండల కేంద్రమైన ఆస్పరి లో గాంధీ పార్కులో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి బహిరంగ సభలకు, వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలకు ఉండే అనుమతి.. వినాయక చవితికి లేకపోవడం దారుణమన్నారు. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్, సినిమా హాలుకు అనుమతించిన ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వినాయక చవితి ఉత్సవాల పై ఆంక్షలు విధించడం హిందూ మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి వినాయక మండపాల ఏర్పాటుకు, ఉత్సవాలకు పూర్తిస్థాయిలో అనుమతి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో టిడిపి నాయకులు బిణిగేరి నారాయణ, తెలుగు యువత నాయకులు రఘు యాదవ్, తలారి రామాంజనేయులు, హాలిగేర రహంతుల్లా, సాయిరామ్, టీఎన్ఎస్ఎఫ్ మండల నాయకులు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author