PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: లోక్ సత్తా

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: అకాల వర్షాలతో పూర్తిగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు కే ఆనంద్ ఆచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం లోక్ సత్తా పార్టీ బృందం మండలంలోని పలు గ్రామాల పంట పొలాలను పర్యటించారు. ఈ మేరకు లోక్ సత్తా పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్నాయని, ఈ కారణంగా రైతులు భారీగా నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎకరాకు 30 వేలు పెట్టుబడి పెట్టి వంటలు చేతికొచ్చే సమయంలో ఎడతెరిపిలేని వర్షాలకు దెబ్బతిని రైతాంగం పూర్తిగా నష్టపోయిందని తెలిపారు. మండలంలోని ఎద్దులదొడ్డి చక్రాల గిరిజన తండాలు చందోలి తదితర గ్రామాల పంటపొలాలను పరిశీలించామని తెలిపారు. వంటలు చేతికొచ్చే దశలో వర్షాలకు దెబ్బతిన్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని అన్నారు. వేరుశెనగ కంది టమోటా పత్తి పంటలు ఏమాత్రం చేతికి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్లరేగడి భూముల్లో రవి సీజన్లో వేసిన పప్పు శనగ ఉల్లి వాము పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు కోలుకోలేని  విధంగా నష్టపోయారని పేర్కొన్నారు. గత సంవత్సరం వర్షాలు అధికమై ఇదే పరిస్థితి నెలకొందని ఈసారి అధిక వర్షాలు పడి రైతులు భారీగా నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని అన్ని విధాల ప్రభుత్వం అభిప్రాయపడ్డారు. ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని. 90 శాతం సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే రైతులకు కొత్తగా బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో లోక్ సత్తా పార్టీ పత్తికొండ తాలూకా అధ్యక్షులు జయరాముడు ప్రధాన కార్యదర్శి ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

About Author