ప్రభుత్వ షోకాజ్ నోటీసులు మా ఉద్యమాన్ని ఆపలేవు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: తగ్గేదెల్యా అంటున్నా అంగన్వాడీ ..ఉద్యమం మొదలుపెట్టి సరిగ్గా నెలరోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకుండా తమను ఉద్యోగాలలో నుంచి తొలగించాలని చూస్తున్నారని అయినా తగ్గేది లేదంటూ బుధవారం అంగన్వాడీలు (గడివేముల) తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరవధీక నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆటు అంగన్వాడి సూపర్వైజర్ అంగన్వాడి వర్కర్స్ కి సంజాయిషీ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు న్యాయం కావాలి సమ్మె మహక్కు డిమాండ్లు ప్రభుత్వం వెంటనే తీర్చాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు రాములమ్మ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.