వచ్చేది కూటమి ప్రభుత్వమే : టి.జి భరత్
1 min readకర్నూలు, పల్లెవెలుగు: మరో రెండు నెలల్లో టిడిపి, జనసేన, బిజెపి ప్రభుత్వం వచ్చేది ఖాయమని కూటమి అభ్యర్థి టిజి భరత్ చెప్పారు. నగరంలోని 15వ వార్డు బుధవారపేటలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కీ టూ గోపీనాథ్ ఆధ్వర్యంలో వైసీపీ యువ నాయకుడు విక్రమ్, అజయ్ బృందం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ యువత భవిష్యత్తు బాగుండాలంటే తమ ప్రభుత్వం రావాల్సిందేనని చెప్పారు. కర్నూల్ లో తాను ఎమ్మెల్యే అయ్యాక స్థానికంగా పరిశ్రమలు తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఒక్క పరిశ్రమ వచ్చినా వేలాది మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. బజ్జీల కొట్టు దగ్గర నుండి బడా వ్యాపారుల వరకు అందరికీ లాభం చేకూరుతుందన్నారు. సరైన ప్రభుత్వం ఉంటేనే ఇదంతా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక ఏ తప్పు చేయని తన అనుచరులపై అనవసరంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని యువకులకు ధైర్యం చెప్పారు. అన్యాయంగా తమపై కేసులు పెట్టే వారిపై తిరిగి కేసులు పెట్టే పరిస్థితి వస్తుందన్నారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్న తనను గెలిపించాలని కోరారు. మహిళలకు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సూపర్ 6 పథకాల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. మహిళలందరూ తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్ గా ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పామన్న, అబ్బాస్, రామాంజనేయులు, పోతురాజు రవి, థరూర్ జేమ్స్, నరేన్, జనసేన కర్నూలు ఇంచార్జి అర్షద్, రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, ఎమ్మార్పీఎస్ నాయకులు నరేష్, తదితరులు పాల్గొన్నారు.