పీఆర్సీ పై ప్రభుత్వ వాదనను వాలంటీర్ల ద్వార ప్రజల్లోకి !
1 min readపల్లెవెలుగువెబ్ : కొత్తగా ప్రకటించిన పీఆర్సీ పై ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు ఆదేశాలు అందాయి. కొత్త పీఆర్సీ పై ఉద్యోగుల జీతాల్లో కోత ఉండదని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, మంత్రి పేర్ని నాని పీఆర్సీ పై వెల్లడించిన వివరాలతో కూడిన పోస్టులు వాలంటీర్లకు చేరాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ సంస్థ వాలంటీర్లకు ఈ పోస్టులు పంపింది. తమ పరిధిలోని 50 కుటుంబాలు ఉన్న గ్రూపులో వీటిని పోస్టు చేయాలని వాలంటీర్లకు ఎఫ్వోఏ సిబ్బంది స్పష్టం చేశారు. వీటిని ఆయా గ్రూపుల్లో వాలంటీర్లు పోస్టు చేస్తున్నారు.