NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అందరి సంక్షేమానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

1 min read

– జగనన్న పరిపాలనలోనే విద్యార్థులకు డిజిటల్ విద్య బైజుస్ ట్యాబ్లు
– స్థానిక వార్డ్ నాయకులు ప్రజలు, స్కూల్ విద్యార్థులు ఎమ్మెల్యేకి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
– ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు కర్నూలు నగరంలోని 7వ వార్డ్ మేట్ స్ట్రీట్ 19వ సచివాలయం పరిధిలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా దళిత, గిరిజన, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మన కు మన ప్రభుత్వానికి జగనన్నని ఆశీర్వదించాలని కోరారు.అలాగే స్థానిక వార్డు ప్రజలు ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికి జగనన్న పరిపాలనలోనే డిజిటల్ విద్య బైజుస్ టాబ్స్ అందించారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు స్థానిక వార్డు కార్పొరేటర్ జుబైర్ అహ్మద్ గారు, రాష్ట్ర హాజ్ కమిటీ డైరెక్టర్ మౌలానా మంజూరు గారు వైస్సార్సీపీ నాయకులు నవీద్ పర్వీజ్ గారు,షౌ్యైబ్ గారు,అన్వార్ గారు, హస్సేన్ గారు,ఆరిఫ్ ఖాన్ గారు,నజీర్ గారు, మాలిక్ గారు,చంద్ గారు ,ఖలీల్ గారు,లతీఫ్ గారు,మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు , జగదీశ్ , మెప్మా ఆర్ పి & OB’s సచివాలయం సిబ్బంది విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author