కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం: ఏఐటీయూసీ
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి మునిస్వామి,మండల కార్యదర్శి కృష్ణమూర్తి. శుక్రవారం కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో హమాలీ సంఘం అధ్యక్షులు హనుమంతు అధ్యక్షతన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి మునిస్వామి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కృష్ణమూర్తి హాజరై మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని కార్మికులకు సరైన ఉపాధి లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పెడుతుందని కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించాలని ప్రయత్నం చేస్తున్నారని భవన నిర్మాణ కార్మికులకు ఇసుక కొరత వలన ఉపాధి లేక లక్షలాది కుటుంబాలు రోడ్డున పడడం జరిగిందని కుటుంబాలను పోషించుకోవడం లేక చాలా మంది కార్మికులు మరణించారని మరణించిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకో లేదని వారికి భరోసా కూడా ఇవ్వలేదని ఆటో హమాలీ భవన నిర్మాణ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల వలన మరణించిన కార్మికులకు మహిళ ప్రసవం,వివాహ కానుక మొదలగు వారికి క్లెయిములు ఇంతవరకు విడుదల చేయలేదని సంక్షేమ బోర్డు లో ఉన్న 6 వేల కోట్ల రూపాయలు మిగులును పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ప్రభుత్వం దారి మళ్ళించి చెందని తక్షణమే ఈ మిగులును ప్రభుత్వం సంక్షేమ బోర్డు కు జమ చేయాలని కరోనా సమయంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడి ఆకలితో అలమటించే వారని కానీ ఆ దాని అంబానీ మొదలగు పెట్టుబడిదారుల ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని కరోనా సమయంలో పార్లమెంట్ నిర్మల సీతారామన్ గారు దేశంలో ఉండే కార్మికులకు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తామని చెప్పి లక్ష కోట్లు కార్మికుల కోసం ప్రకటించడం జరిగిందని ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క కార్మికునికి ఇవ్వలేదని ఈ లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుబడిదారులకు కట్టబెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఉరుకుంద బ్రహ్మయ్య ఏఐటీయూసీ నాయకులు చంద్రశేఖర్ రామాంజనేయ గోవిందు వీరేశ్ రంగన్న తదితరులు పాల్గొన్నారు.