NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం : గురుదాస్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుదాస్, మండల కార్యదర్శి  డి.రాజా సాహెబ్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య లు విమర్శించారు. బుధవారం మండలంలోని నలక దొడ్డి గ్రామ సిపిఐ శాఖ మహాసభలు శాఖ కార్యదర్శి బ క్షాల ఈరన్న అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రజలపై పెను భారం మోపే విధంగా మునుపెన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్నంటే విధంగా పెంచడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లా రని, మోడీ విధానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే విధంగా ఉద్యమాలకు సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లక్ష్మీ నరసయ్య, ఉరుకుందు, ఏంగిల్స్, కార ప్ప, తదితరులు పాల్గొన్నారు.

About Author