కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం
1 min read– రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన ఆరోపించారు ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య. సోమవారం కర్నూలులోని సలామ్ఖాన్ భవనలో ఏఐటీయూసీ 6వ మహాసభ జరిగింది. జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి డీసీ రహిమాన్ అధ్యక్షతన సభ జరిగింది. ముందుగా వెలుగోడు సీనియర్ నాయకులు అరుణ్, రషీదు ఏఐటీయూసీ జెండాను ఎగరవేశారు. సభలో aituc రాష్ట్ర నాయకులు మనోహర్ మాణిక్యం aituc జిల్లా అధ్యక్షుడు పి. శుంకయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శి మూనెప్ప భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి నరసింహులు aituc నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భముగా రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాల పేరుతో వ్యవసాయరంగం , విద్యుత్ ప్రైవేటీకరణ పేరుతో నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం డీసీ రహిమాన్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్లో ఉన్న అన్ని స్కీములకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలలో దోన్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సురేంద్ర పుల్లయ్య వెల్దుర్తి నాయకులు నగమద్ధయ్య కర్నూలు నల్లన్న ఆనంద్ కల్లూరు మహమ్మద్ హుసేన్ రేణుక కృష్ణ బేతంచేర్ల సూర్యచంద్ర అల్లగడ్డా యిందిరమ్మ.పత్తికొండ రామచంద్ర రంగన్న ఏమ్మిగానురు వీరెస్ వెలుగోడు హుసేన్ భాష అధోని రాజు లక్ష్మీనారాయణ తదతరులు పాల్గొన్నారు.