PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీతాలు…పెన్షన్లు చెల్లింపులో ప్రభుత్వ వైఫల్యం – ఎస్టీయూ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర వ్యాప్తంగా 13లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యా యులు,కార్మికులు, పెన్షనర్ల జీతాలు,పెన్షన్లు చెల్లింపులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఈ రోజు తేదీ 10-09-2023 వరకు కూడా దాదాపు లక్ష మంది ఉద్యోగు లు,ఉపాధ్యాయులు,పెన్షణర్లకు జీతాలు,పెన్షన్లు చెల్లించలేదని, దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న,విమర్శించారు. ఈ మేరకు తేదీ 10-09-2023 న కర్నూలు జిల్లా ఎస్టీయు ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్. గోకారి అధ్యక్షతన జరిగినది. సమావేశములో జిల్లా ప్రధాన కార్యదర్శి టి. కె. జనార్దన్,సీనియర్ నాయకులు మహ్మద్ షఫీ, ఇ.సుధాకర్ గౌడ్,శేకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధానకార్యదర్శి హెచ్.తిమ్మన్న మాట్లాడుతూ.

1. ఈ రాష్ట్ర లో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు,కార్మిక,పెన్షనర్లు ప్రతి నెల జీతాలు, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న దారుణ పరిస్థితి అత్యంత బాధాకరమని, ఈ ప్రభుత్వం దివాలా తీసిందా అని అనుమానం కలుగుతోందని తెల్పారు.

2.ప్రజా వ్యతిరేక,ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేవని చరిత్ర చెబుతుందని హితవు పలికారు.

3.గౌ.ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ సిపియస్ రద్దు,పాత పెన్షన్ పునరుద్ధరణ, ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దికరణ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

4.పాత పెన్షన్ పునరుద్ధరణ చేయక పోతే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి 13 లక్షల మంది,ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు మొత్తం 60 లక్షల మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

5. రాష్ట్రం లో చదువుకున్న నిరుద్యోగుల కోసం తక్షణం మెగా డీఎస్సీ వేయాలని, ఖాళీగా ఉన్నటువంటి 40 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

6. జీ. ఓ.117 ను రద్దు చేయాలని,తరగతుల విలీనం ఉపసంహరణ చేయాలని డిమాండ్ చేశారు.

7.ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయలకు పదోన్నతులు,బదిలీలు,నిర్వహించాలని,విద్యాశాఖ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

7. కస్తూరి బా పాఠశాలల ఉపాధ్యాయులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

8.ప్రభుత్వం లో విలీనం అయిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు,సుధీర్,రాముడు, ముదసిర్ అహ్మద్,పవిత్రన్ పాల్గొన్నారు.

About Author