ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ..
1 min read– వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” ఆదేశాల మేరకు పట్టణంలోని 22వ వార్డు సచివాలయం కోడ్ (21018016) లో నాల్గవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక 22వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వారికి అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు.ఈ సందర్భంగా “ఎర్రకోట జగనన్న” మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలు అమల్లో అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే జమ చేస్తున్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి తగిన ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వార్డులోని కొన్ని ప్రాంతాల్లో డ్రైన్ల సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా సత్వరం పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, పార్టీ నాయకులు, చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలెంటర్లు తదితరులు పాల్గొన్నారు.