PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలను లాక్షాధి కారులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం

1 min read

-ఘనంగా 4వ విడత వైస్సార్ ఆసరా సంబరాలు

– కోలాటాలుపూల వర్షాలతో ఎమ్మెల్యేరవీంద్రనాథ్ రెడ్డికి హారతులు పట్టిన డ్వాక్రా మహిళలు

– జ్యోతి ప్రజ్వలన చేసిన ఎం యల్ ఏ,, పి, రవీంద్ర నాధరెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  మహిళల ఆర్థికాభివృద్ధి పెపొందించి వారిని లక్షాధికారిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్ర నాధరెడ్డి అన్నారు, గురువారం స్ధానిక పంచాయతీ ఆవరణ (పార్కు) ఆవరణ లో ఏర్పాటు చేసిన వైస్సార్ ఆసరా 4 వ విడత సంబరాలు నిర్వహించారు,ఈసందర్భంగా ఈకార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఎంఎల్ఏ రవీంద్రనాథ్ రెడ్డికి డ్వాక్రా మహిళలు కోలాటాలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు, అనంతరం డ్వాక్రా మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే పి రవీంద్రనాథ రెడ్డి మాట్లాడుతూ ,మహిళలు ఆర్థికాభివృద్ధి చెందిన ప్పుడే ఆకుటుంభం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,మహిళ పక్షాపాతి గా మహిళల అభ్యన్నతి కి అహర్నిశలు పాటుపడుతున్నారని తెలియజేశారు, గత ప్రభుత్వం మహిళల బ్యాంక్ రుణాలను మాపీ చేయిస్తామని మాయమాటలు చెప్పి మహిళలను మోసం చేసిందన్నారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన పాద యాత్రలో మహిళల కష్టాలను కళ్లారా చూసి  విడతలవారిగా నాలుగు విడతలు డ్వాక్రా మహిళలకు సంబంధించిన బ్యాంకు రుణాలు అన్నిటిని కూడా చెల్లించడం జరుగుతుందని చెప్పడం జరిగిందన్నారు, చెప్పిన మాటకు కట్టుబడి డ్వాక్రా అక్కచెల్లెమ్మల బ్యాంకు రుణాలన్నిటిని కూడా చెల్లించడం జరుగుతుందన్నారు, ఇందులో భాగంగా నేడు మూడో విడత వైయస్సార్ ఆసరా ద్వారా మండల వ్యాప్తంగా 562 స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 4 కోట్ల, 15 లక్షల, 36వేల 5 వందల రూపాయల చెక్కును ఇవ్వడం జరిగిందన్నారు, బ్యాంకుకు సంబంధించిన ఋణాలన్నింటిని తీర్చడమేకాక, వారికి సున్నా వడ్డీ నికూడా ఇవ్వడం జరిగిందన్నారు, అంతే కాకుండా మహిళలకు వివిధ పథకాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన తెలియచేశారు, ఈసంక్షమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి దాదాపు 50,వేలనుండి, 2 లక్షలు, అలాగే ఐదు లక్షలు, 10 లక్షల లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు, ఇలా చెప్పినవి అలాగే చెప్పనివి కూడా ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగిందన్నారు, ఇల్లాంటి తరుణం లో మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అండగా ఉండి ఆయనను ఆశీర్వదించాలన్నారు,డ్వాక్రా మహిళలు బ్యాంకు రుణాల ద్వారా, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చైతన్యవంతులై, తమ కుటుంబానికి ఆసరాగా నిలబడడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని, ఇందులో ఎక్కడ కూడా కులం, మతం, పార్టీలు చూడడం లేదని అర్హులు అయితే చాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు, సంక్షేమ పథకాలలో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చూడడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, అక్కా చెల్లెమ్మలకే కాకుండా, వృద్ధులను గత ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షన్ కు తిప్పుకునేవారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన తర్వాత వృద్ధులకు వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనమందరం కూడా అండగా నిలబడి ఆయనను 40 ఏళ్లు సీఎంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు, అనంతరం డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు, అలాగే డ్వాక్రా మహిళలకు 4కోట్ల, 15 లక్షల, 36 వేల 5 వందల రూపాయల మెగా చెక్కును అందచేశారు, అంతకుముందు డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎంత అభివృద్ధి చెందనది వివరించారు,, ఈకార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జియన్,భాస్కర్ రెడ్డి, వైస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి యస్ ఆర్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, ముదిరెడ్డి రవీంద్రారెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లిశ్రీరామ మూర్తి ,సర్పంచ్ సిద్ధిగారి వెంకట సుబ్బయ్య, మండకోఆప్సన్ మెంబర్, వారిష్,ఎంపీటీసీలు,, ఎరసాని నిరంజన్ రెడ్డి, డి,నాగిరెడ్డి, రఘు రామిరెడ్డి,సాధక్ అలీ, సర్పంచ్ లు, సుదర్శన్ రెడ్డి, పీసీ కేశవరెడ్డి, టి ఎన్ చంద్ర రెడ్డి, తుంగా చంద్ర శేఖర్ యాదవ్, సొంట్టం నారాయణరెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఏపీ యం,గంగాధర్,సీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

About Author