రైతుల కుటుంబాలుగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం
1 min readపల్లెవెలుగు, వెబ్ మహానంది : అడవి బిడ్డల కుటుంబాలను రైతు కుటుంబాలు గా మార్చడమే వైయస్సార్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మహానందిలో పేర్కొన్నారు .మహానంది లోని పోచ బ్రహ్మానంద రెడ్డి డార్మెటరీ నందుచెంచులకు ప్రభుత్వం కేటాయించిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలను అందజేయడానికి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు .దాదాపు యాభై రెండు ఎకరాలు ఫారెస్ట్ భూమిని మహానంది పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు కుటుంబాలకు పట్టాల రూపంలో అందజేసే కార్యక్రమంప్రారంభించారు .ఈ కార్యక్రమంలోఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి హుండాయ్ కంపెనీ ప్రతినిధులు అయినా అరుణ్ భాటియా , పుతిన్ అరుణ్ మరియు దేవదత్త పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుండాయ్ కంపెనీ సహాయ సహకారాలతో చెంచు కుటుంబాలకు కేటాయించిన భూమి అభివృద్ధి చేసి పండ్ల తోటలు అయినా జామ ,సపోటా రకాలైన మొక్కలు నాటి మూడు సంవత్సరాల పాటు వాటిని అభివృద్ధి చేసి నాలుగో సంవత్సరం లో పల సహాయంరానున్న సమయంలో వారికే అప్పగిస్తారని పేర్కొన్నారు .చెంచులు ఆధునిక వ్యవసాయం వైపు మల్లె విధంగా కంపెనీ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు .శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మహానంది బండి ఆత్మకూరు పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో నివసించే చెంచులకు ప్రభుత్వం ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూమిని కేటాయించిందని దానిని హుండాయ్ కంపెనీ అభివృద్ధి చేసి గిరిజనులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు .ఒక కోటి 20 లక్షల రూపాయల పైనే కంపెనీ ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు .కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ చెంచులు విద్య వైద్యం ఈ రంగాల్లో అభివృద్ధి చెందాలని వ్యవసాయ రంగంలో కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా కంపెనీ అన్ని రకాల ఆర్థిక సహాయ సహకారాలు వారికి అందజేస్తుందని తెలిపారు .ప్రభుత్వం కూడా అందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ..ఈ కార్యక్రమంలోఐ టి డి ఓ పి ఓ రాజశేఖర్ రెడ్డి జెడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి ,ఎం పి పి యశస్విని పాటు సీఐ రవీంద్ర ఎస్సై నాగార్జున రెడ్డి మరియు ఆత్మకూరు బండి ఆత్మకూరు మహానంది ఈ ప్రాంతాలకు చెందిన గిరిజన మహిళలు పాల్గొన్నారు అనంతరం అడవి బిడ్డలకు కేటాయించిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూమిలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తో పాటు కంపెనీ ప్రతినిధులు పండ్ల మొక్కలను నాటారు .ఈ కార్యక్రమం అనంతరంమధ్యాహ్నం నుండి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మహానంది లో గడప గడప కార్యక్రమాన్ని చేపట్టారు.