ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం
1 min read– అర్హులైన ప్రతి కుటుంబానికి- సంక్షేమ పథకాలు
– ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ-
– అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తున్న.. ఎమ్మెల్యే, పోచంరెడ్డి,రవీంద్ర నాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఎక్కడన్నా మిగిలి ఉన్న సమస్యలను తెలుసుకొని క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించడమే గడపగడపకు మన ప్రభుత్వం లక్ష్యమని అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, గురువారం చెన్నూరు టౌన్ లోని అరుంధతి నగర్, సుగాలి కాలనీ, గ్రామ లలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి, ఆయన తనయులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి కి ప్రజలు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే, రవీంద్రనాథ్ రెడ్డి ఆయన తనయులు నరేన్ రామాంజనేయుల రెడ్డి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించడం జరిగింది, అలాగే ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించి- ఆశీర్వదించాలని ఆయన కోరారు, అనంతరం అరుంధతి నగర్, సుగాలి కాలనీ ప్రజలు, తమకు డ్రైనేజీ సమస్య ఉందని డ్రైనేజీ నీళ్లు వెళ్లడం లేదని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, అలాగే ఒక పిల్లాడికి ఆరోగ్యం సరిగా లేదని, పెన్షన్ ఇప్పించి, ఏదైనా మంచి ఆసుపత్రిలో చూపించాల్సిందిగా ఎమ్మెల్యేని కోరడం జరిగింది, ఆయన వెంటనే స్పందించి డాక్టర్లతో మాట్లాడి ఆ పిల్లాడికి వైద్యం అదేవిధంగా చూస్తామని చెప్పడం జరిగింది, యువ నాయకులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి కి కొంతమంది ఇంటి స్థలాలు కావాలని కోరడం జరిగింది, సానుకూలంగా వారి సమస్యలు విన్న ఆయన అక్కడే ఉన్న అధికారులను ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని ఆదేశించడం జరిగింది, వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు తెలియ చేశారు, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అక్కడి ప్రజలను వారు కోరారు, మీరు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే మేము అధికారులు అంతా కలిసి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేశారు, మీ సమస్యలు తెలుసుకునేందుకే మీ ఇంటి వద్దకే రావడం జరిగిందని ఆయన ప్రజలను పదే పదే అడగడం జరిగింది, ఇక్కడ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని, ఒకవేళ ఏదైనా సమస్య వల్ల ప్రభుత్వ పథకాలు అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ, పార్టీలు అసలే చూడరని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలియజేశారు,అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలని ఆశీర్వదించాలని కోరారు, ఈ కార్యక్రమంలో, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి , ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్ , వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి , , సర్పంచులు సిద్ధిగారి వెంకటసుబ్బయ్య, సొంతం నారాయణరెడ్డి, తుంగ చంద్రశేఖర్ యాదవ్, గుమ్మల మధుసూదన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామ్మూర్తి, రఘురామిరెడ్డి, సాదిక్ అలీ, రఘురాం రెడ్డి, దుంప నాగిరెడ్డి, కమలాపురం నియోజకవర్గం మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, , కమలాపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చిన్న బాబు, ఎన్ చంద్ర రెడ్డి, టిఎన్ మహేశ్వర్ రెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్,, అబ్దుల్ రబ్, గోర్ల పుల్లయ్య శివారెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు , మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.