PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

1 min read

– సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, మండలంలోని శివాలపల్లె గ్రామ పంచాయతీలో 57 లక్షల రూపాయలతో( ఏపీ ఆర్ ఆర్ పి) నిధుల ద్వారా శివాల పల్లె హరిజనవాడ నుండి, శివాలపల్లె మెయిన్ వరకు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన తన యులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి, సోమవారం భూమి పూజ చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి గాను ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, శివాల పల్లెకు సంబంధించి రోడ్డు అద్వానంగా ఉండడం తో వర్షాకాలంలో అటు గ్రామ పంచాయతీ ప్రజలు , రైతులు అనేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు, ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలు రైతులు చిరకాల ఆకాంక్ష నెరవేరినట్లు అయిందని ఆయన తెలియజేశారు, కమలాపురం నియోజకవర్గం లో 19 వర్క్ ప్యాకేజీ కింద కోట్ల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు, ఇందులో భాగంగా చెన్నూరు మండలంలో ఈ నిధుల ద్వారా రెండు పనులను చేపట్టడం జరిగిందన్నారు, ఇప్పటికే మండలంలోని బలిసిం గాయపల్లి లో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని, అలాగే శివాల పల్లి హరిజనవాడ నుండి, శివాల పల్లి మెయిన్ వరకు 57 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు, ఈ పనులను కూడా త్వరగ తిన పూర్తి చేసేందుకు టెండర్ ద్వారా, 770 మీటర్లు కాంట్రాక్టర్ విశ్వనాథరెడ్డి వెంకటేశ్వర కన్ స్ట్రక్షన్, పనులను వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు, దీంతో శివాల పల్లి గ్రామపంచాయతీ ప్రజలకు రాక పోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో, సర్పంచ్ ముమ్మడి సుదర్శన్ రెడ్డి, ఉప సర్పంచ్ రామ సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్( చిన్న) వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పుల్లయ్య యాదవ్, జడ్పిటిసి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, కొండపేట సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎంపీటీసీలు ముదిరెడ్డి సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, రఘురాం రెడ్డి, నిరంజన్ రెడ్డి, అస్రత్, వారీస్, శివ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author