PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలపై హింసను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు – ఐద్వా 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మహిళలపై హింసను అరికట్టవలసిన ప్రభుత్వాలు హింసను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నాయని – అఖిలభారత మహిళా సంఘం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి రమాదేవి అన్నారు.మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జూలై 28న శ్రీకాకుళంలో ప్రారంభమైన పోరుయాత్ర శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చేరుకుంది. ఈ పోరుయాత్రకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ,సంఘీభావం తెలుపుతూ, స్వాగతం పలికారు. గురుకుల కస్తూరిబా పాఠశాల లో ఏర్పాటు చేసిన సభకు ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలమ్మ అధ్యక్షత వహించారు. ముందుగా కళాకారులు కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం సభను ఉద్దేశించి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర కోశాధకారి సావిత్రి మాట్లాడుతూ,మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జూలై 28న శ్రీకాకుళంలో ప్రారంభమైన పోరుయాత్ర నేడు కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి,  రాష్ట్ర కోశాధకారి సావిత్రి   మాట్లాడుతూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలపై హింసాకాండ రోజురోజుకు పెరుగుతుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు సైతం మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాకముందు మద్యాన్ని నియంత్రించి మహిళల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతానని ప్రకటించారన్నారు. నేడు మద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలన సాగించటం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలపై జరుగుతున్న హింసాకాండకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో మహిళలు ఎక్కువగా పాల్గొనాలని, అదేవిధంగా ఆగస్టు 8న పోరుయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు వేలాదిమంది మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గురుకుల కస్తూరిబా పాఠశాలల అధ్యాపకులు , ఐద్వా ,జిల్లా అధ్యక్షురాలు అరుణ, గౌరవ అధ్యక్షురాలు ధనలక్ష్మి, కోశాధికారి పిఎస్ సుజాత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పెద్దహుల్తి సురేంద్ర, మహిళ సంఘం నాయకురాలు వనిత, హారిక భారతి తదితరులు పాల్గొన్నారు.         

About Author