NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ‌వ‌ర్నర్ తీవ్ర అసంతృప్తి !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పై రాష్ట్ర గ‌వ‌ర్నర్ బిశ్వభూష‌ణ్ హ‌రిచంద్ అసంతృప్తి వ్యక్తం చేసిన‌ట్టు స‌మాచారం. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు గ్యారంటీ ఒప్పందంలో వ్యక్తిగ‌తంగా గ‌వ‌ర్నర్ పేరు చేర్చడం పై ఆయ‌న అభ్యంత‌రం వ్యక్తం చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో ముఖ్యమంత్రి కార్యాల‌య అధికారులు గ‌వ‌ర్నర్ ఆఫీసుకు క్యూ క‌ట్టారు. రుణ ఒప్పందంలో గ‌వ‌ర్నర్ పేరు చేర్చడంపై హైకోర్టు కూడ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేప‌థ్యంలో దిద్దుబాటు చ‌ర్యల‌పై ప్రభుత్వం మ‌ల్లగుల్లాలు ప‌డుతోన్నట్టు తెలిసింది. గ‌వ‌ర్నర్ పేరు తొల‌గించి, కొత్తగా ఒప్పందం చేసుకోవాలా ?.. ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఉందా అని బ్యాంకు అధికారుల‌తో మ‌ల్లగుల్లాలు ప‌డుతున్నట్టు స‌మాచారం.

About Author