PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం -7 సార్లు విద్యుత్ చార్జీలు పెంపు

1 min read

– వచ్చే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకువస్తాం:రమేష్ రెడ్డి,శివరామిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి మరియు మండ్ర శివానందరెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్తు చార్జీలను తగ్గించాలని కోరుతూ టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట టిడిపి మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి మరియు వివిధ గ్రామాల టిడిపి నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో మరియు ధర్నా చేపట్టారు.అనంతరం నంద్యాల రహదారిలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర టిడిపి నాయకులు ధర్నా చేపట్టారు.అనంతరం మండల విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి కుమార్ కు వారు వినతి పత్రాన్ని అందజేశారు.ఈసందర్భంగా టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వచ్చి నాలుగు సంవత్సరాలు అయిందని ఇప్పటికీ ఏడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచి బడుగు బలహీన వర్గాల నడ్డి విరుస్తున్నారని అన్నారు.విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తే పింఛన్లను తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచిందని ఆయన అన్నారు.ఈమధ్య జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా పట్టభద్రులు మంచి తెలివితో టీడీపీకి ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించారని ఆయన అన్నారు.తర్వాత టిడిపి మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై గ్రామాలకు వెళ్లి ప్రజలకు వివరిస్తామని అంతేకాకుండా వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలను చైతన్యవంతం చేస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో సంపంగి రవీంద్రబాబు,సుధాకర్ రెడ్డి, శేషిరెడ్డి,రమణారెడ్డి,సుధాకర్,ఇద్రిస్, సుభాన్,దేవనూరు మాజీ సర్పంచ్ నాగేంద్రుడు,మొల్ల చాకర్ వలి,సోఫీ సాహెబ్, రమణారెడ్డి,రహంతుల్లా,వెంకటేశ్వర్లు,శివ,సుల్తాన్, చాంద్ బాషా,లక్ష్మీనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author