ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి..
1 min read– మిల్లర్లు తేమ, నాణ్యత లోపాలు చూపిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు..
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ కు వినతిపత్రం అందించిన.
– కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కీర్తి వెంకట రాంప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కీర్తి వెంకట్ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద తడిసిన ధాన్యం మరియు మొలకెత్తిన రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది, ఈ ధర్నా కార్యక్రమంలో రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా కీర్తి వెంకట రాంప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని అకాల వర్షాలతో రైతుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం అని ప్రధానంగా ఏలూరు జిల్లాలో 2. 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దెబ్బతిని రంగు మారింది దాదాపు పది లక్షల ఎకరాలలో వరి సాగు మరియు ఇతర పంటల సాగుచేసిన అనేకమంది రైతులు నష్టపోయారు ప్రధానంగా వరి సాగు మొక్కజొన్న అరటి రైతులు తీవ్రంగా నష్టపోయ రన్నరు. ఏలూరు జిల్లాలో వరి దిగుబడి మూడు లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల వరి పండగ మొక్కజొన్న సేకరణ కేంద్రాలు పూర్తిగా తెచ్చుకోలేదు అంతేకాక మిల్లర్లు తేమ శాతం మరియు నాణ్యత లోపం పేరుతో పరిమాణంలో కోత పెడుతుండడం వలన రైతులు మద్దతు ధర లభించక నష్టపోతున్నారన్నరు. అంతేకాక కొంతమంది రైతులు ఈ క్రాప్ లో నమోదు కానందున తమ ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో దెబ్బతిన్న రంగు మారిన ధాన్యం ఎక్కువగా ఉన్నందున రైతులు తమ పంట విలువను నష్టపోకుండా కొనుగోలు నిబంధనలో సదలింపులు ఉండాలి అలాగే అన్నదాతల కష్టాలను దృష్టిలో ఉంచుకొని రైతుల వద్ద నుండి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాము ప్రధానంగా ఓసి ఉన్న వరి పంట నీట మునిగింది వరి కోతలు జరిగి కళ్ళల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో పాటు మొలకలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అంతేకాక ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో మరల ఆరబెట్టవలసి రావడంతో కూలి ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తేమ ముక్క శాతంతో సంబంధం లేకుండా నిబంధనలను సడలికి వీలైనంత త్వరగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్ళను వెంటనే చేపట్టాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నది వరదలు వర్షాలు మరియు తెగుళ్ల వలన నష్టపోయిన రైతులకు ఆహార పంటలకు ఎకరాకు 30000 ఉద్యమ వాణిజ్య పంటలకు 50 వేలు చొప్పున నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా ప్రధాన డిమాండ్లు వర్షం కారణంగా ధాన్యాన్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కొనుగోలు చేయాలి వర్షం కారణంగా మునుపటిలాగా ముక్క శాతం 40 శాతానికి కొనుగోలు చేయాలి వరి రైతులకు మంచి నాణ్యమైన సంచులను అందజేయాలి వర్షం కారణంగా కళ్ళల్లో ధాన్యాన్ని దగ్గరి మిత్రులకు రవాణా చేయాలి వర్షం కారణంగా నూక శాంతం ఎంత ఉన్నా కూడా కొనుగోలు చేయాలి వర్షం కారణంగా మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్లు చేశారు. వాతావరణ శాఖ వారు రెండు రోజులలో తుఫాను ఉందని హెచ్చరిస్తున్నారు కనుక బడుగులలో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాల్లోకి వెంటనే తరలించాలని భారతీయ జనతా కిసాన్ మోక్ష డిమాండ్ చేస్తుంది పైన ఉదాహరించిన అంశాలపై సానుకూలంగా స్పందించి సత్తన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమoలో కిసాన్ మోర్ఛ ఏలూరు జిల్లా అధ్యక్షులు కీర్తి వెంకట్ రామ్ ప్రసాద్,SRR లక్ష్మి సూర్యనారాయణ రాజు, SC మోర్ఛ జిల్లా అధ్యక్షులు మతి శ్రీనివాస శాస్త్రి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌటపల్లి విక్రమ్ కిషోర్,బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి లు కర్రిబండి నాగరాజు, కట్నేటి కృష్ణ ప్రసాద్ ,ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ గాధి రాంబాబు ,మహిళ మోర్ఛ జిల్లా ప్రధానకార్యదర్శి M క్రిష్ణ కుమారి,OBC మోర్ఛ జిల్లా కార్యదర్శి బోల్ల శ్యామల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.