PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గిరిజన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

1 min read

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు..
పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్కేతాండ గ్రామానికి చెందిన రెడ్డి శంకర్ నాయక్ అనే గిరిజన రైతు నకిలీ మొక్కజొన్న విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాడని, వ్యవసాయ అధికారులు నిర్లక్ష్య ధోరణితో రైతుకు జరిగిన నష్టం పై కనీసం పరిశీలించకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందనకు వచ్చి నష్టపోయిన రైతుకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ మనిజర్ జిలాని సామున్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూరెడ్డి శంకర్ నాయక్ దాదాపు 22 ఎకరాల్లో అడ్వాంటే కంపెనీ కి చెందిన మొక్కజొన్న సీడ్ తో మొక్కజొన్న పంటను సాగు చేయడం జరిగిందని అన్నారు. అయితే పంటలో మొక్కజొన్న కంకులు ఒక మొక్కకు ఒకటే రావాల్సి ఉండగా మూడు నాలుగు వస్తుండడంతో సీడ్ ప్రభావంతో దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపడం జరిగిందని అన్నారు. ఎకరాకు 40 వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టిన ఆ రైతుకు కనీసం ఎకరాకు మూడు క్వింటాళ్ల చొప్పున కూడా పంట రాకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దాదాపు 6 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం వాటిలిందని కలెక్టర్కు వివరించారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారికి తెలిపినప్పటికీ రెండు నెలలు కావస్తున్న కనీసం పంట పరిశీలించలేదని అన్నారు. ఏదో ఒక సాకు చెబుతూ ఆ రైతు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. గిరిజన రైతుకు జరిగిన నష్టం పట్ల స్పందించాల్సిన వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు. వెంటనే రైతుకు న్యాయం చేయాలని నకిలీ సీడ్ తయారుచేసిన కంపెనీ, విత్తనం సరఫరా చేసిన అన్నదాత సీడ్ యజమానులపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాలునాయక్, ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, జి వి ఎస్ రాయలసీమ ఇన్చార్జి రవీంద్ర నాయక్, విక్రమ్ నాయక్ రైతులు రెడ్డి శంకర్ నాయక్, శ్రీను నాయక్, కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author