PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

1 min read

– రాంగోపాల్ వర్మ లాంటి దిగజారిన వ్యక్తిని యూనివర్సిటీకి ఆహ్వానించిన వైస్ ఛాన్సలర్
– క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, కర్నూలు నగరంలోని బిర్లా గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు!
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ సందర్భంగా AIMSS రాష్ట్ర కార్యదర్శి ఎం. తేజోవతి మాట్లాడుతూ – చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళితే, అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చని, మానవుడు భూమిపైనే అన్నీ అనుభవించాలని, జీవితాన్ని ఎంజాయ్ చేయండని అని విద్యార్థులకు వల్గర్ మెటీరియలిజం పాఠాలు చెప్పడం ఇంత కంటే సిగ్గు చేటు ఇంకేమీ లేదని విమర్శించారు… నేను కేవలం నా కోసమే బ్రతుకుతానని నా మరణం తర్వాత ఈ ప్రపంచం ఏమైపోయినా బాధపడనని, ఎదుటివారు ఏమనుకుంటారోనంటూ జీవించేవాడు నా దృష్టిలో మరణించినట్టేనని, తాను మానవ సమాజంలో ఉన్నానని దానికి నియమాలు ఉన్నాయని గుర్తించక నీచమైన స్వార్థాన్ని నేర్పాడాన్ని ఖండించారు… ఏదైనా వైరస్ వచ్చి తాను తప్ప, మగజాతి అంతా మరణించాలని, అప్పుడు తనొక్కడినే స్త్రీ జాతికి దిక్కవుతానని మానవ సమాజాన్ని, ముఖ్యంగా స్త్రీలను అపహాస్యపాలు చేసేలా మాట్లాడారని, ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన విద్యార్థులను దిగజారుడు మార్గం పట్టించే విధంగా ప్రసంగించారని అన్నారు. కోరికలు సహజ సిద్ధం, మహిళలకు అందం ఎక్స్ ట్రా పవర్ లాంటిదని, అమ్మాయిలకు కటింగ్ ఇవ్వడం కోసమే విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాను అని, విద్యార్థులకు దిగజారిన మానవ సంబంధాలను, విష సంస్కృతిని బోధిస్తూ వ్యాప్తి చేస్తున్న రాంగోపాల్ వర్మ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.AIDSO రాష్ట్ర అధ్యక్షులు వి. హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, అధ్యాపకులు, అఫిలియేటెడ్  కాలేజీల ప్రిన్సిపల్స్, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థుల ముందు జంతువు స్థాయి కంటే దిగజారిన వ్యాఖ్యలు చేయడానికి అవకాశం కల్పించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు… తనను తాను జంతువుగా ప్రకటించుకొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మను, ఆధునిక ఫిలాసఫర్ అని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు చెప్పడం, ఇంజనీరింగ్ పూర్తి చేయకుండానే సర్టిఫికెట్ వర్మకు ఇవ్వడం నేడు సమాజంలోని విద్యా వ్యవస్థ యొక్క పతనాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు… నేను ఏదైతే అనుకొంటానో అదే వాస్తవమని ఆచరిస్తానని, ‘తిని, తాగి, ఎంజాయ్’ చేయండని విద్యార్థులకు బోధించడం అనేది విద్యార్థులకు ఎలాంటి మార్గ నిర్దేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు…. సమాజ హితం కోరేవారు, విజ్ఞత కలిగినవారు ఖండించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు విజయలక్ష్మి, ఖాదర్, విశ్వనాథ్ రెడ్డి, మల్లేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author