ప్రభుత్వ చౌక బియ్యం పట్టివేత
1 min readపల్లెవెలుగు, చెన్నూరు:మండల కేంద్రంలోని అరుంధతి నగర్ లో కొండు హరికృష్ణకు చెందిన రేకుల షెడ్డు వద్ద రవాణాకు సిద్ధంగా ఉంచిన ప్రభుత్వ చౌక బియ్యాన్ని దాడులు నిర్వహించి విజిలెన్స్ అధికారులు టీ రెడ్డప్ప, ఈ బాలగంగాధర్ రెడ్డి లు తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కడప రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారి షేక్ మాసుం బాష ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కడప విజిలెన్స్ అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి చెన్నూరు అరుంధతివాడకు చెందిన కొండు హరికృష్ణకు చెందిన రేకుల షెడ్డు వద్ద కడప టౌన్ చుట్టు ప్రక్కల గ్రామాల నుండి సేకరించిన రేషన్ బియ్యంను అక్రమముగా నిల్వ ఉంచి రవాణా చేయుటకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం మేరకు, ఆ స్థలం వద్దకు వెళ్లి అకస్మికంగా తనిఖీ చేయగా, ప్లాస్టిక్ సంచులలో 133 బస్తాలు గల పిడిఎస్ రేషన్ బియ్యం ఉన్నవని తెలిపారు, వాటి తూకము వేయగా మొత్తం 6,823 కేజీలు కాగా వాటి మొత్తం విలువ Rs.2,76,331/- గా ఉన్న వని వారు తెలిపారు, సరుకును పంచనామా ద్వారా స్వాధీనపరచుకొని అరుంధతివాడకు చెందిన కొండు హరికృష్ణ , చెన్నూరుకు చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తులపై చెన్నూరు పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేయడమైనదని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఏవో, ఆర్ ఐ పి. సౌజన్య , వీఆర్వో షేక్ రసూల్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ జనార్దన్ రావు, డి రంతు బాష, తదితరులు పాల్గొన్నారు.