PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జి పి యస్ విధానం ఎంత మాత్రమూ ఆమోద యోగ్యం కాదు – యుటిఎఫ్

1 min read

పల్లెవెలుగు వెబ్  ప్యాపిలి: ముఖ్యమంత్రి  ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని దాని స్థానంలో ఎలాంటి విధానాన్ని అంగీకరించబోమని యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మద్దిలేటి పేర్కొన్నారు.గ్యారంటెడ్ పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి  హామీ ఇచ్చిన ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2004 సెప్టెంబర్ 1 వ తేదీ కంటే ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి తక్షణమే పాత పెన్షన్ అమలు చేయాలని అక్టోబర్ 12 నుండి ఒక వారం రోజుల పాటు పోస్టు కార్డ్ ఉద్యమం చేపట్టడం జరుగుతోందని అందులో భాగంగా శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని ముఖ్యమంత్రి కి  పోస్టు కార్డులు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కృష్ణా నాయక్,ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి,జిల్లా కౌన్సిలర్లు శేషయ్య,బొజ్జన్న,సర్వజ్ఞ మూర్తి,చంద్ర మోహన్,అంజనప్ప,హరి నారాయణ,ఆంజనేయ ప్రసాద్, జిల్లా సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్,మండల గౌరవాధ్యక్షులు శంకరయ్య,సహాధ్యక్షులు రమేష్ నాయుడు,ఆర్థిక కార్యదర్శి మధు,ప్రధానోపాధ్యాయులు ఉమా దేవి,పద్మా బాయి,నెల్లూరప్ప,రాజేంద్ర,నరసింహ రాజు,మండల కార్యదర్శి ఖలీల్,అంజనయ్య,రాజన్న,ఆడిటర్ శివ కేశవులు,ఉపాధ్యాయులు రమేష్,జ్యోతి,పద్మావతి,గురు స్వామి,కృష్ణా నాయక్,స్వాతి,నీలోఫర్,మురళి మోహన్,షబానా,పద్మావతి,శివ ప్రసాద్,షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author