కాళ్లు పట్టుకుని జీవిత డబ్బులు తీసుకున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ తమ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని జోస్టర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఫిలిం ప్రొడక్షన్స్ అధినేతలు కోటేశ్వరరాజు, హేమ ఆరోపించారు. ‘గరుడ వేగ’ సినిమా తీసే క్రమంలో తమ ఇంటికి వచ్చి కాళ్లుపట్టుకుని జీవిత డబ్బులు తీసుకున్నారని చెప్పారు. సినిమా విడుదలకు ముందు పెద్దమనుషుల సమక్షంలో రూ.26కోట్లకు అగ్రిమెంటు కూడా ఇచ్చారన్నారు. నిర్మాతలను ట్రాప్‌చేసి మోసం చేయడం జీవిత నైజమని ఆరోపించారు. సమన్లు అందకుండా చేశారని జీవిత చెప్పడం కరెక్టు కాదని, సమన్లు అందినట్టు ఆన్‌లైన్లో ఉందన్నారు. న్యాయస్థానాన్ని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కొవిడ్ ఉందని నకిలీ సర్టిఫికెట్‌తో మోసం చేశారని చెప్పారు.