NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లతో ముఖాముఖి

1 min read

– కార్యక్రమం నిర్వహించిన టిడిపి నాయకుడు మండిపల్లి
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా రాయచోటి : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తరపున తెలుగుదేశం పార్టీ యువనాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలోని కొత్త పేట, జగదాంబ సెంటరులో పర్యటించి కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ లో పట్టభదులైన ఓటర్లను కలుసు కొని ప్రచారం చేశారు.. ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి రావడం తథ్యమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకుతు ప్రతి ఏటా జాబ్ క్యాలండర్’ను విడుదల చేస్తూ యువతకు సాధ్యమైనంత వరకు ఏదో ఒక ఉపాది కల్పిస్తామన్నారు. వైకాపా, పాలనలో నిరుద్యోగులు చాలా నష్టపోయారన్నారు. అన్ని రంగాలలో విఫలమైన ప్రభుత్వాన్ని ఇంటి దారి పట్టించాలన్నారు. దీనికోసం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఓటర్లందరూ ఒక్కతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థించిన భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి కి ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని బహుమతిగా అందించాలని ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున్ రెడ్డి, రవి నాయుడు,అంజి యాదవ్, ఉమేష్ యాదవ్, గణేష్ యాదవ్, మండిపల్లి అభిమానులు టిడిపి కార్యకర్తలు మహిళా ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author