పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
1 min readరాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ కరిముల్లా
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: పశ్చిమ రాయలసీమ కడప, కర్నూలు చిత్తూరు అనంతపురం, పట్టబద్రులు తమ ఓటు హక్కు కోసం ఈనెల 7వ తేదీ లోపు ఓటు నమోదు చేసుకోవాలని, అదేవిధంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తమ పరిధిలోని పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేసుకునే విధంగా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ కరీముల్లా తెలిపారు, శుక్రవారం ఆయన స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అదే విధంగా పట్టభద్రుల ఓటు నమోదు గురించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు తనకు బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందన్నారు, అలాగే చెన్నూరు మండల పట్టభద్రుల ఇన్చార్జులుగా బాలస్వామి రెడ్డి కడప 40 వ, డివిజన్ కార్పొరేటర్, అదేవిధంగా కడప 44వ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి కి కేటాయించడం జరిగిందన్నారు , దీనికి సంబంధించి వైఎస్ఆర్సిపి మండల నాయకులు, కార్యకర్తలు, తమ వంతు బాధ్యతగా తీసుకొని మీ మీ ప్రాంతాలలో ఉన్న పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించడమే కాకుండా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి విజయానికి దోహదపడే విధంగా వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు, పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకునేందుకు ఈనెల 7వ తేదీ వరకు సమయం ఉందని, పట్టభద్రులు ఆన్లైన్ ద్వారా గాని, లేదా గ్రామాలలో ఉన్న బి ఎల్ వో లు వద్ద కానీ దరఖాస్తు ఫారాలు తీసుకొని తాసిల్దార్ కార్యాలయంలో ఇవ్వాలని ఆయన తెలియజేశారు, ఇంకా వీటి పైన ఏవైనా సందేహాలు ఉంటే తాసిల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని ఆయన తెలియజేశారు, మండల వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా తీసుకొని పట్టభద్రుల ఓటు నమోదుకు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జిఎన్ భాస్కర్ రెడ్డి , కొండపేట సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, మిట్ట రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.