గ్రాడ్యుయేట్లు – ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి
1 min read
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని తహాశీల్దార్ వెంకటశివ తెలిపారు. స్థానిక తహాశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై బిఎల్ఓలతో రెవెన్యూ అధికారులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహాశీల్దార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వచ్చేనెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుందన్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఫారం 18 తో దరఖాస్తు చేసుకోవాలని ఉపాధ్యాయులు ఫారం 19 తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 197 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆర్ ఐ నాగేంద్రుడు అసిస్టెంట్ వెంకటయ్య వీఆర్వోలు బి ఎల్ వో లు పాల్గొన్నారు.