ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
1 min read– సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : గ్రామపంచాయతీకి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వంతు కృషి చేసినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి లు అన్నారు, మంగళవారం వారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు మెంబర్లతో గ్రామపంచాయతీ అభివృద్ధి, అలాగే సమస్యల పై సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా సర్పంచ్, కార్యదర్శులు మాట్లాడుతూ, చెన్నూరు గ్రామపంచాయతీ ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అందుకు అందరి సహకారం ఎంతో అవసరమని వారు తెలియజేశారు, వార్డు మెంబర్లు తమ పరిధిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని వారు తెలిపారు, ఇప్పటికే కోట్లాది రూపాయలు వేచించి డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణం, త్రాగునీటి పైపులు వంటి పనులను చేయించడం జరిగిందన్నారు, అదేవిధంగా గ్రామ శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడపడితే అక్కడ ప్రజలు, వర్తకులు చెత్తా, చదారం ,వ్యర్థాలు వేయకుండా చూడాలని వారు తెలిపారు,అంతేకాకుండా గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు, పరిసరాలు బాగుండకపోతే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వారు అన్నారు, కాబట్టి ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పై అవగాహన కలిగి ఉండాలని వారు తెలిపారు, అంతేకాకుండా తడి- చెత్త, పొడి -చెత్త పై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, ఈ తడి చెత్త, పొడి చెత్త తో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల లో వర్మి కం పోస్టు ద్వారా రైతులకు ఉపయోగపడే నాణ్యమైన ఎరువులను తయారు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లుపాల్గొన్నారు.