జిల్లా పేరు మార్పునకు నోచుకోని గ్రామపంచాయతీ
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినటువంటి గాజులపల్లె గ్రామ పంచాయితీ కార్యాలయం సూచికల నందు ఇంతవరకు జిల్లా పేరు మార్చకపోవడం ఒకింత ఆశ్చర్యపరుస్తుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం డిలిమిటేషన్ లో భాగంగా జిల్లాలు విభజన చేసింది. వెంటనే నూతనంగా ఏర్పడిన ఆయా జిల్లా పరిధిలోకి వచ్చే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సూచికల బోర్డుల్లో నూతనంగా ఏర్పాటు అయిన జిల్లా పేరు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మహానంది మండలం నంద్యాల జిల్లాలోకి చేరింది. కానీ ఈ పంచాయతీకి మాత్రం కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నట్లు సూచికల బోర్డులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారికంగా పార్లమెంటులో మరియు రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత అప్పుడు జిల్లా కేంద్రం పేరు మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.