ఘనంగా కురవల 21వ కార్తీక వనభోజనం….
1 min read– కర్నూలు జిల్లా కురవ సంఘం….
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ శ్రీ బీర లింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం నందు 21వ కార్తీక వనభోజనం సందర్భంగా ఉసిరి చెట్టుకు పూజ ,జ్యోతి ప్రజ్వలన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల మాధవ్ ,బీసీ కమిషన్ మెంబర్ కిష్టప్ప , మాజీ అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న అధ్యక్షుడు శ్రీనివాసులు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కే .రంగస్వామి మాట్లాడుతూ కురువ కులస్తులందరూ ఐక్యంగా ఉండాలని, తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలని, ఆర్థికంగా బాగా ఎదగాలని కులస్తులందరూ ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో తమ కులస్తులను గెలిపించుకోవాలని పార్టీలకతీతంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కురువ కులస్థులకు తమ వారికి సమస్య వచ్చినప్పుడు పార్టీలకతీతంగా పనిచేసే వారికే పట్టం కట్టాలని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రామచంద్రయ్య ,అమీలియా హాస్పిటల్ అధినేత లక్ష్మీప్రసాద్,శశికళ కృష్ణమోహన్ ,లీలమ్మ ,అనిత , పంచలింగాల నాగరాజు, దేవేంద్ర,పుల్లన్న ,పాలసుంకన్న ,బిల్డర్ వెంకటేశ్వర్లు ,ధనుంజయ ,బి .సి .తిరుపాల్ ,దివాకర్ ,వెంకటేష్ శివరాం, భూదురు లక్ష్మన్న, కిష్టన్న కెసి నాగన్న తౌడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు,