ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు : ఎస్పీ
1 min readపల్లెవెలుగు,వెబ్ నంద్యాల : నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె. రఘువీర్ రెడ్డి IPS గారి ఆద్వర్యంలో బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా ఎస్పీ గారు పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు . ఈ సందర్భంగా ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాలగురించి ఆయన జీవిత విశేషాల గురించి వివరించారు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు నందు గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లా లోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామం.(అప్పట్లో ప్రకాశం జిల్లా ఏర్పడలేదు.కనిగిరి,పడమటిపల్లె నెల్లూరు జిల్లా లో ఉండేవి.) ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు.వివాహం జరిగిన కొద్ది రోజుల తర్వాత1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. ఆ తరువాత పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-1942 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు – మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. – “సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. అతని గురువు ప్రపంచానికే గురువు, సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు….. శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ, కులపతి (గాంధీ) ఆదరాన్నీ చూరగొన్నాడు. జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు అని వివరించారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ R.రమణ గారు ,నంద్యాల టౌన్ DSP మహేశ్వర్ రెడ్డి గారు, RI సుధాకర్ గారు , RSI లు ,వారి సిబ్బంది ,నంద్యాల సబ్ డివిజన్ CI లు ,SI లు పాల్గొన్నారు .