PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ జన్మదిన వేడుకలు           

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : మాజీ ఎంపీపీ వైసీపీ నాయకురాలు ఎస్ నాగ రత్నమ్మ జన్మదిన వేడుకలు అభిమానులు, వైసిపి పార్టీ శ్రేణుల నడుమ ఘనంగా జరిగాయి. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని పత్తికొండ, మద్దికేర తుగ్గలి మండలాల్లోని పలు పలు గ్రామాల నుండి పార్టీ శ్రేణులు, ఎస్వీ అభిమానులు తరలివచ్చి   బాణాసంచా పేల్చుతూ, కేక్ కట్ చేసి నాగరత్నమ్మ జన్మదిన సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకొని పూలమాలలు,పుష్పగుచ్చాలతో నాగరత్నమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలనుండి ఎస్వీ క్యాడర్ అభిమానంతో ఎస్ నాగరత్నమ్మకు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మాజీ కే డి సి సి వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, పత్తికొండ సర్పంచ్ కొమ్ము దీపిక, మాజీ సర్పంచ్ జి సోమశేఖర్,  మాజీ ఉప సర్పంచ్ పల్లె ప్రతాప్ రెడ్డి, వైసీపీ యువనేత శ్రీకాంత్ రెడ్డిపర్యవేక్షణలో నాగరత్నమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

About Author