ఘనంగా మాజీ ప్రధాన మంత్రి జయంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు మండల బీజేపీఅధ్యక్షులు గాడి భాస్కర్ ఆధ్వర్యంలోమాజీ దేశ ప్రధానమంత్రి వాజ్ పాయ్ 99జయంతి సందర్భంగా గాడి భాస్కర్ మాట్లాడుతూ వాజ్ పాయి ప్రధానిగా ఉన్న సమయంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటాక్ నుండి కటక్ వరకు స్వర్ణచతుర్భుజి ఆకారంలో అతిపెద్ద జాతీయ రహదారులు నిర్మించారని అన్నారు.అలాగే మారుమూల గ్రామీణ ప్రాంతలకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రహదారులు నిర్మించడం జరిగింది అంతే కాకుండా పోక్రాన్ లో అను పరీక్షలు విజయవంతంగా నిర్వహించి ప్రపంచ దేశాలకు భారతదేశ శక్తి సామర్త్యాలను తెలియజేసారనన్నారు బీజేపీ పార్టీ మూల సిద్ధాంతమైన అంత్యోదయ స్పూర్తితో సమాజంలో ని చిట్ట చివరి పౌరునికి అభివృద్ధి ఫలాలు అందాలని,అవినీతిరహిత పాలన అందించారని అన్నారు , వాజ్ పాయి స్ఫూర్తి తో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి చెందిన అగ్రదేశాల సరసన నిలుపుతూ,భారత దేశాన్ని విశ్వగురువు గా మారుస్తున్న కృషీవలుడు అలుపెరుగని శ్రామికుడు మోడీ అన్నారు, ప్రధానిగా భాద్యతలు స్వీకరించిన తరువాత దేశంలో దశాబ్దాల కాలంగా ఉన్న ఎన్నో సమస్యలను సామరస్యంగా పరిష్కరించటం జరిగిందని భారత ప్రభుత్వం వాజ్ పాయ్ జయంతి ని సూపరిపాలన దినోత్స్వం గా జరుపుకుంటున్నదని తెలిపారు .ఈ కార్యక్రమం లో భరత్ రెడ్డి,ప్రతాప్,శివా రెడ్డి,గంగాధర్,రామసుబ్బయ్య,ముకుంద స్వామి,రెడ్డి ప్రసాద్మునిసుబ్బారెడ్డి ,రవి కుమార్,శ్రీనివాసులు,వెంకటసుబ్బయ్య,బీజేవైఎం కాశీ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.