NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా టీడీపీ నేత అశోక్ గౌడ్ జన్మదిన వేడుకలు

1 min read

– శుభాకాంక్షలు టిడిపి నాయకులు కార్యకర్తలు
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: టిడిపి రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్,ఏపీ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చలమోలు.అశోక్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు స్థానిక శ్రీరామ్ నగర్ ఆయన నివాసంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేశారు.ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ నాయకులు,గౌడ సంఘం నేతలు, టిడిపి నాయకులు ఆయనను గజమాలతో సత్కరించి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.టిడిపి కొల్లేరు ప్రాంత నాయకుడు సైదు గోవర్ధన్ ఆయనకు పుష్ప కుచ్చు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని, బీసీలకు టిడిపితోనే న్యాయం జరుగుతుందని చెప్పారు. వైసిపి ప్రభుత్వం గద్దెనెక్కాక బీసీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, బీసీల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. బీసీలకు టిడిపి అధికారంలో ఉన్న సమయంలో పెద్దపీట వేసిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం సర్పంచి మేకా.కనకరాజు,  టిడిపి కొల్లేరు ప్రాంత నాయకుడు సైదు గోవర్ధన్, మహిళా నాయకురాలు దుర్గాదేవి,పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author