NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా విజయమ్మ జన్మదినవేడుకలు.. రంజాన్​ తోఫా పంపిణీ   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పోచిమిరెడ్డి సేవాదళ్ ఆధ్వర్యంలో బుదవారం శ్రీమతి వైయస్ విజయమ్మ  జన్మదిన సందర్భంగా సేవాదళ్ నందు సభ్యులైన 700 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసారు. సేవాదళ్ సభ్యులతో కలిసి పొచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి కేక్ కట్ చేసి విజయమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నిరుద్యోగులకు  FREE EAPCET కోచింగ్ కార్యక్రమాన్నిరేపటి నుండి ప్రారంభిస్తామని పోచిమి రెడ్డి సేవాదళ్ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి తెలిపారు.ఉచిత కోచింగ్ తీసుకో దలచిన వారు ఆధార్ కార్డ్, EAPCET అప్లై చేసిన హాల్ టికెట్ జిరాక్స్ తో సేవాదళ్ ఆఫీస్ నందు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అనిత ,సరోజ, వార్డు మెంబర్లు బోడా సావిత్రి, లైట్ నాగరాజు, శివ మరియు మాజీ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు గోవిందరాజు ,బసన్న, చక్రాల కాంత రెడ్డి, పులికొండ రామానాయుడు మరియు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

About Author