PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా అక్కినేనినాగ చైతన్య జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక శ్రీరామ టాకీస్ అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రవి, రాజన్న, ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి చిత్ర కళాకారుడు దేశెట్టి శ్రీనివాసులు  హాజరయ్యి, కేక్ కట్ చేశారు.  అనంతరం అక్కినేని ఫ్యాన్స్  శాలువా తో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా దేశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ అక్కినేని కుటుంబం సమాజంలో పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు సేవ చేయడమే కాకుండా, సినీ పరిశ్రమలో అగ్ర హీరోలుగా  వెలుగుతున్నారని అన్నారు. అదేవిధంగా  అక్కినేని ఫిలింఫేర్ అవార్డు రావడం చాలా సంతోషమన్నారు.ఈ కార్యక్రమంలో చిన్ని, అశోక్, మోజేషు, రాకేష్, రాము, రాజేష్, ప్రశాంత్, మారుతి, నవీన్, లక్ష్మణ్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

About Author