NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఎలక్ట్రిషన్ డే వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి పట్టణంలోని సిఐటియు కార్యాలయం లో ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ పాలెం. శ్రీనివాసులు అధ్యక్షతన ఎలక్ట్రిషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శుక్రవారం సిఐటియు ప్యాపిలి మండలం అధ్యక్షులు పోదొడ్డి. రామాంజనేయులు మాట్లాడుతూ ప్రపంచానికి వెలుగును ఇచ్చిన మహనీయుడు థామస్ అల్వా ఎడిసన్ 27-01-1880 బలుపుని కనుగొన్న రోజు అని అన్నారు,ప్రపంచంలో ఎలక్ట్రిషన్ లేకుండ ఎవ్వరు కూడా ఏ పని చెయ్యలేరు అని ఎలక్ట్రిషన్ పని అనేది ఎంతో గౌరవప్రదమైన వృత్తి అలాంటి ఎలక్ట్రిషన్ కు సమాజంలో మంచి పేరు ఉంది అని తెలిపారు,ఎలక్ట్రిషన్స్ అందరూ కూడా పూర్తి భద్రతో జగర్తలు వహించి మీ కుటుంబనికి రక్షణగా ఉండాలని కోరారు,ఎవరు కూడా ధైర్యన్ని కోల్పోవద్దని ఎలక్ట్రిషన్ వర్కర్స్ అందరూ ఐక్యంగా ఉంటూ కలసినడిచి పనిలో నైపుణ్యం సాధించాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఇలియాజ్ ,నాగేంద్ర,చంద్ర, విజయ్, రవి ,జాఫర్ ,ఎన్. శ్రీనివాసులు ,సి .అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.

About Author