ఘనంగా శ్రీ.శ్రీ.జయంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండలో ఆదివారం శ్రీ. శ్రీ.113వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.స్థానిక శాంతి టాలెంట్ స్కూల్ లో (అరసం ) ఆధ్వర్యంలో శ్రీశ్రీ 113వ జయంతి పాఠ శాల ప్రధానోపాధ్యాయులు విజయ లక్ష్మి అధ్యక్షతన జరిగింది.శ్రీశ్రీ పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళలర్పించారు.ఈ సంద్భంగా అభ్యుదయ రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, శ్రీశ్రీ కవిత్వం అభ్యుదయ రచయితల కు ఆదర్శమని,యువకవులకు దిక్సూచి ఆయన అని అన్నారు.సామాజిక చైతన్యం కలిగించే సాహిత్యం,శ్రమజీవుల స్వేదాన్ని వివరించే ప్రయత్నం చేశారని అన్నారు.శ్రీశ్రీ ఒక సాహిత్య చైతన్య గీతిక అన్నారు.కార్మిక కర్షక వర్గాలను వెన్ను తట్టి మేలుకో అని విప్లవ మార్గాన్ని,ఉద్యమ మార్గాన్ని పట్టించిన కవిత్వము అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ కవిత్వం నూతన కవులకు మార్గ నిర్దేశం అన్నారు.ఈ కార్యక్రమంలో నాగరాజు,హమీద్, రహమ్తుల్ల,రంగ నాయకులు,నబి,స్పూర్తి,విజయభారతి,భారతి,ధనలక్ష్మి,రేష్మ,కళావతి,శ్రీవిద్య, రమాదేవి,సుశీల,సరోజ ,పాల్గొన్నారు.