NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీ దాసాంజనేయ స్వామి ఏడవ వార్షికోత్స వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరంలో స్థానిక అశోక్ నగర్ శ్రీ దాసాంజనేయ స్వామి ఏడవ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, స్వామి వారికి నది సముద్ర జలాల తో 108 కళాశాల తో అభిషేకం, హనుమాన్ హోమం మరియు ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలియజేశారు. ఈ మహోత్సవాలు 26 ఆదివారం నుండి 30 గురువారం వరకు నిర్వహిస్తున్నట్లు జి ఎల్ శ్రీనివాసరావు తెలియజేశారు. స్వామివారిని దర్శించి పూజించిన వారికి అష్టైశ్వర్య లు. ఆరోగ్యాo నిండుగా మెండుగా ఉంటాయని భక్తుల నమ్మకం అని తెలిపారు. స్వామివారికి నిత్య పూజలు. తీర్థప్రసాదాలు. అభిషేకాలు నిర్వహిస్తుంటామని కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 31 వ డివిజన్ కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణరావు,అర్చకులు పవన్ శర్మ, కమిటీ సభ్యులు కె. వెంకటేశ్వరరావు, ఎమ్. శివకుమార్, డి.రామకృష్ణ, కె కె. శ్రీనివాసరావు, ఎమ్. రాఘవేంద్రరావు, టివి.రెడ్డి, జి. విగ్నేష్ , నాగేంద్ర, ఎం. శోభారాణి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author