NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా చేగొండి హరిరామ జోగయ్య జన్మదిన వేడుకలు

1 min read

– ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా హరిరామ జోగయ్య జన్మదిన వేడుకలు నిర్వహించిన బలిజలు

– గిరిజనులకు చీరలు పంపిణీ చేసిన ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ యర్రంశెట్టి మస్తాన్ రాయలు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా : సీనియర్ రాజకీయ కోవిదుడు,సామాజికవేత్త ,ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిని కాంక్షించే శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారి గౌరవపూర్వక జన్మదినం పురస్కరించుకొని చిట్వేలి మండలం రాజారెడ్డి యానాది కాలనీలో కడప, అన్నమయ్య జిల్లాల ,కాపు సంక్షేమ సేన కోఆర్డినేటర్ యర్రంశెట్టి మస్తాన్ రాయలు ఆధ్వర్యంలో గిరిజనులకు చీరలు ,వస్త్రాలు పంచడం జరిగింది,ఈ సందర్బంగా మస్తాన్ రాయలు మాట్లాడుతూ శ్రీ హరిరామ జోగయ్య గారు నాటి తరం – నేటి తరం రాజకీయాలకు వారధి వంటి వారు అని, చట్టసభల సభ్యునిగా, మంత్రివర్యునిగా తాను నిర్వహించిన పదవులకు వన్నెతెచ్చారాని,రాజకీయాల్లో ధైర్యం మనోనివ్వరం ఆత్మ అభిమానంతో ఎలా పని చేయవచ్చో ఆయన ఎనిమిదిన్నర దశాబ్దాల వయసులో కూడా విశ్రాంతికి పరిమితం కాకుండా ఇప్పటికీ చేస్తున్న రాజకీయ శ్రమ కొనియాడ తగినది అని తెలిపారు,ఈసారి ఆయన తన జన్మదినాన్ని అణగారిన వర్గాల మధ్య జరుపుకోవడం ఆయనలోని సామాజిక వచ్చినయానికి నిదర్శనంగా భావిస్తున్నాను, ఆయనకు భగవంతుడు ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆయుష్షును ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు, ఉమ్మడి కడప జిల్లాలో కాపు సంక్షేమ సేన బడుగు బలహీన వర్గాలను కలుపుకొని ముందుకు వెళుతుందని ఉమ్మడి కడప జిల్లా కాపు సంక్షేమ సేన కోఆర్డినేటర్ యర్రంశెట్టి మస్తాన్ రాయలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మాదాసు నరసింహ ,మాదాసు శివ, హరి ,కాపు సంక్షేమ సేన నాయకులు, గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.

About Author