NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి..

1 min read

– తెలుగువారి ఆత్మగౌరవం కాపాడే పార్టీ టిడిపి నే

– టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో బుధవారం నాడు టిడిపి పార్టీ ఆధ్వర్యంలో మండల టిడిపి అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి సర్పంచ్ ఎక్కల దేవి రవణమ్మ ఆధ్వర్యంలో , ఇతర నేతలతో కలిసి ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల టిడిపి అధ్యక్షుడు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. పేద ప్రజలు కడుపునిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో రూ.2 కే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన తక్కువ కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. ఇక ఎన్టీఆర్ పేరున్న హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం మంచిది కాదన్నారు. ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు పెట్టిన అన్న క్యాంటీన్లను కూడా వైసిపి ప్రభుత్వం కొనసాగించలేదన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలో వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బిడుదురు సీతారాం రెడ్డి . నంద్యాల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగశేషులు దేశం నారాయణరెడ్డి.. మైనార్టీ నాయకులు గపూర్.. అవ్వారు శ్రీకాంత్.. యువ నాయకుడు గంజర్ల గణేష్ రెడ్డి టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author