PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా నాయిబ్రాహ్మణుల… వనభోజన మహోత్సవం..

1 min read

నోపా నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రముఖులు

పల్లెవెలుగు: నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ కర్నూలు వారి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం మరియు నాయి బ్రాహ్మణ వనభోజన కార్యక్రమం జరిగింది. స్థానిక రాయలసీమ యూనివర్సిటీ దగ్గరలో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నోపా అధ్యక్షుడు డాక్టర్ నవీన్ కుమార్ అధ్యక్షత వహించాడు. ముఖ్య అతిథులుగా కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బి వై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ మధుసూదన్ , మాజీ పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక ,  డిఎస్పి మహబూబ్ బాషా ,  సిఐ ఉపేంద్ర బాబు, జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు శ్రీ జమ్ముల జనార్ధన్ హాజరయ్యారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాయి బ్రాహ్మణ సోదరులు మన భోజన కార్యక్రమం జరుపుకోవడం సంతోషదాయకం ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సోదరులు నిర్మించిన విద్యార్థి వసతిగృహం ఎంతో బాగుందన్నారు. వీరు విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమన్నారు. అనంతరం  హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ విద్యకి ఎంతో ప్రాధాన్యత నిచ్చి పేద విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఒక షెల్టర్ ఉండాలనే ఉద్దేశంతో కీర్తిశేషులు సి వి నర్సయ్య ధృడ సంకల్పంతో భవన నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన మరణానంతరం ఆ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొని ఆయన తనయుడు డాక్టర్ నవీన్ కుమార్ ఎంతో శ్రమించి ఈ భవన నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. పేద నాయి బ్రాహ్మణ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే  కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ఇలా కులమంతా ఒక చోట చేరి ఒక కుటుంబంలో వనభోజనాల కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. టిటిడి ట్రస్ట్ బోర్డ్ మెంబర్నెంబర్ శ్రీ సిద్ధవటం యానాదయ్య మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని వారికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించిందన్నారు ప్రతి సెలూన్ కు 150 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందిస్తున్నారు అన్నారు అలాగే జగనన్న తోడు కింద పేద నాయి బ్రాహ్మణులకు పది వేల రూపాయలు ఉచితంగా అందిస్తున్నానన్నారు. జగనన్న ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు కింద స్కూల్ అని ఆధునికరించడం జరిగింది అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నాయి బ్రాహ్మణులు ఒక అద్భుతమైన భవనాన్ని కర్నూల్లో నిర్మించుకోవడం ఎంతో సంతోషదాయకం ఉన్నారు. కర్నూలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాయి బ్రాహ్మణులు కార్తీక వనభోజనం నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు. అలాగే నాయి బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఒక భవనం నిర్మించుకోవడం ఎంతో సంతోషించేదగ్గ విషయం అన్నారు. కావున పేద నాయి బ్రాహ్మణ విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఉన్నత చదువులు చదవాలని కోరారు. జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు శ్రీ జమ్ముల జనార్దన్ మాట్లాడుతూ నూతన భవనం ప్రారంభోత్సవానికి మరియు కార్తీక వనభోజనానికి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన నాయి బ్రాహ్మణుల సోదర సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. నోపా  అధ్యక్షుడు డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నోపా ఉపాధ్యక్షుడు ధన విజయుడు, నోపా జనరల్ సెక్రెటరీ పోలీసు వెంకట స్వామి,  నోప కోశాధికారి అనుకొండ మద్దిలేటి , రామాంజనేయులు మల్లికార్జున వెంకటేష్,  పసుపుల  మధు, లక్ష్మీపురం రాఘవేంద్ర దేవనకొండ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author