ఉప్పలదడియలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
1 min read-ఆకట్టుకున్న నాటక ప్రదర్శన
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామం ఆర్ సి ఎం విచారణ గురువులు ఫాదర్ డి.మధుబాబు ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉ.8 గంటల నుంచి మ.3 గంటల వరకు ఉప్పలదడియ చర్చి నుండి దిగువపాడు కల్వరికొండ గుడి వరకు రహదారి వెంట నడుచుకుంటూ 14 స్థలాలను స్మరించుకుంటూ క్రైస్తవులు ప్రత్యకంగా ప్రార్థనలు చేశారు.అలనాడు ఏసుక్రీస్తు సిలువలో పడిన బాధలు శ్రమలు గురించి దారి పొడవునా చాలా చక్కగా నాటక ప్రదర్శన ఆకర్షణీయమైన దుస్తుల ద్వారా నాటకం ప్రదర్శిస్తూ ఉంటే అందరూ భావోద్వేగానికి గురయ్యారు.ఉప్పలదడియ, కలమందలపాడు,మాసపేట, కడుమూరు,49 బన్నూరు, చౌటుకూరు,దేవనూరు,పై పాలెం,దిగువ పాడు,కేతవరం గ్రామాల క్రైస్తవులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.విచారణ గురువులు మధుబాబు దివ్య బలి పూజను సమర్పించారు. అనంతరం వచ్చిన వారందరికీ చౌటుకూరు సంఘస్తులు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజలు థోమాస్, జగదీష్,విచారణ పెద్దలు ఆనందరావు,పక్కిరయ్య, ఫ్రాన్సిస్,బాబు,ప్రసాద్,సతీష్, అయ్యస్వామి,బాలస్వామి, హరి,శేఖర్,సూరి,సామన్న,పల్లె వెలుగు పాత్రికేయులు స్వాములు(రత్నం),ఉపదేశలు మరియు 10 గ్రామాల విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.