ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ మండలం లో 77 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విష్ణు ప్రసాద్, స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఎదుట సివిల్ జడ్జి, పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ గోపాల్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపిపి నారాయణదాసు , ఎంపిడిఓ , ,గ్రంధాలయంలో లైబ్రరీయన్ రామ్ కుమార్ , గ్రామ పంచాయతీ కార్యాలయం లో గ్రామ సర్పం చు కొమ్ము దీపిక పాల్గొని స్వతంత్ర జెండాలు ఎగురవేశారు. అలాగే స్థానిక తేరు బజారులో యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో సామూహిక స్వతంత్ర దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సుంకన్న అనే రైతును, ఆర్మీ జవాన్, జూనియర్ కళాశాల రామ్మోహన్ ను ఏ స్పందన సొసైటీ నిర్వాహకులు సురేంద్ర, లక్ష్మన్న, సింగం శ్రీనివాసులు ఈ సందర్భంగా సన్మానించారు. అదేవిధంగా హోసూరు గ్రామంలోని నరసింహ స్వామి ప్రైవేట్ పాఠశాలలో కరస్పాండెంట్ కె. వీరప్ప ఆచారి ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు స్వాతంత్ర సంగ్రామ ఘట్టాలను, స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారితో సాగించిన వీరోచిత పోరాటాలను, స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన వీర గాధలను వినిపించారు.