ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read– ఉద్యోగ అన్వేషి నుండి ఉద్యోగ ఇచ్ఛేవారి స్థాయికి ఎదగాలి
– రాబోయే రోజుల్లో శక్తి వంత దేశంగా భరత్
– వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫజలుర్ రహమాన్
పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్ : కర్నూలు నగరంలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫజలుర్ రహమాన్, రిజిస్ట్రార్ బాయినేని శ్రీనివాసులుతో కలిసి జాతీయ జెండాను ఎగుర వేశారు. మంగళవారం ఈ సందర్బంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫజలుర్ రహమాన్ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం మన దేశం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ఉండేది విదేశీ అక్రమణదారుల వల్ల స్వాతంత్రం వచ్చే నాటికీ పేద దేశంగా మిగిలిపోయామని అన్నారు. మన స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన త్యాగ మూర్తులను మనం సమారించికోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందన్నారు. నేడు యావత్ ప్రపంచం మన దేశం అవాలంభిస్తున్న ఆర్థిక విధానాలను ప్రశాంశీస్తుందన్నారు. ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న మన దేశం మూడవ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందన్నారు. భూమి నుండి అంతరిక్షం వరకు, నీటి నుండి నింగి వరకు, వైద్యం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వంటి అనేక రంగాల్లో మన దేశం ప్రగతి సాధించిందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠ్యంశా చదువులతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు తమకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉద్యోగ అన్వేషి నుండి ఉద్యోగ ఇచ్చే స్థాయికి ఎదగాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫజలుర్ రహమాన్ పిలుపునిచ్చారు. అనంతరం ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫజులుర్ రహమాన్, రిజిస్ట్రార్ బాయినేని శ్రీనివాసులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ జె.ఎండి.షఫీ, ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటప్ప, బోధన, బోధనేతరా సిబ్బంది, విద్యార్థులు, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు పాల్గొన్నారు.