ఘనంగా సామాజిక సమత సంకల్పం కార్యక్రమం ప్రారంభం
1 min readవిజయవాడలో19న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : డా.బి. ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్,పుస్తక ప్రదర్శన ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఈ నెల 19వ తేదీన విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంభేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ, స్మృతివనం ప్రారంభిస్తున్న సందర్బంగా సామాజిక సమత సంకల్పం కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లాస్ధాయి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్లెక్సీ బ్యానర్ పై డా. బి.ఆర్. అంభేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తామని మద్దతు తెలుపుతూ ప్రతిజ్ఞ చేస్తూ ప్లెక్సీ బ్యానర్ పై తమ సంతకాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ,జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి,జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి,అడిషనల్ ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, డి ఆర్ వో యం.వేంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ కె రవికుమార్, డిప్యూటీ మేయర్లు నూకపాటి సుధీర్ బాబు, గుడిదేసి శ్రీనివాస్,కో ఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, ఏ యం సి నెరుసు చిరంజీవి,అర్ డి వో ఎన్.ఎస్ కె. ఖాజవలీ,పలువురు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.